కార్యకర్తకు చంద్రబాబు పాదాభివందనం..!
కడపలో జరిగిన వైకాపా బాధితుల సమావేశంలో... పార్టీ కార్యకర్తకు చంద్రబాబు పాదాభివందనం చేశారు. పార్టీ మారనందుకు తనపై దాడి చేశారని తెదేపా సీనియర్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన్ను చంద్రబాబు ఓదార్చారు. వయసు పైబడినా పార్టీకి అండగా ఉన్న ఆయనకు చంద్రబాబు పాదాభివందనం చేశారు.