'చంద్రబాబు రాజకీయాలు ఏమాత్రం పనిచేయవు' - చంద్రబాబుపై విమర్శలు
తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య విమర్శలు గుప్పించారు. 151 సీట్లతో గెలిచిన ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేస్తుంటే... అడ్డు తగలడానికి చంద్రబాబు ఎవరని ఆయన ప్రశ్నించారు. శాససమండలి రద్దు చేసి కేంద్రానికి తీర్మానం పంపిస్తే అక్కడ తాను చూసుకుంటానని తెదేపా అధినేత వ్యాఖ్యానించడం ఏంటని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయాలు ఏ మాత్రం పనిచేయవని... కొంత ఆలస్యమైనప్పటికీ మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రం ఆమోదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
rama chandraiah