చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో జరిగిన తెదేపా నేతలపై దాడి ఘటనను ఖండిస్తూ... కడప జిల్లా తెదేపా నాయకులు చేపట్టిన చలో తంబళ్లపల్లి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కడపలోని తెలుగుదేశం నేతలను.. పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
తెదేపా నేతల 'చలో తంబళ్లపల్లి' అడ్డగింత - kadapa latest news
కడప జిల్లా తెదేపా నేతలు చేపట్టిన చలో తంబళ్లపల్లి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని గృహ నిర్బంధం చేశారు.
తెదేపా నేతల చలో తంబళ్లపల్లి అడ్డగింత
పరామర్శించేందుకు వెళ్లిన నాయకుల వాహనాలపై దాడి చేయడం సరికాదని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకు వైకాపా నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. తక్షణమే దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.