కడప జిల్లా బద్వేలులోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. దీనిని వేదిక అధ్యక్షులు సాంబశివారెడ్డి ప్రారంభించారు . ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టీసీ బస్టాండ్‌కు ఎంతోమంది ప్రయాణికులు వస్తారని.. వారందరీ దాహార్తిని తీర్చడం వల్ల ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు. నీటి వాడకాన్ని బట్టి చలివేంద్రంలో అదనంగా క్యాన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో చలివేంద్రం - badvel
ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు కడప జిల్లా బద్వేలులో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రెడ్డి ఐక్య వేదిక అధ్యకుడు దీనిని ప్రారంభించారు.
రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో చలివేంద్రం