ఏపీఐఐసీ ఛైర్మన్, ఎండీలతో కేంద్ర టెక్స్‌టైల్ శాఖ అధికారుల భేటీ అయ్యారు. రాష్ట్రంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు మౌలిక వసతులను పరిశీలించేందుకు కేంద్రం బృందం రాష్ట్రానికి చేరుకుంది. రేపు వైఎస్ఆర్ జిల్లాలో భూములు, మౌలిక వసతులను కేంద్రం బృందం పరిశీలించనుంది.
రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర బృందం.. ఆ జిల్లాలో టెక్స్‌టైల్ పార్కు!
రాష్ట్రంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు మౌలిక వసతులను పరిశీలించేందుకు కేంద్రం బృందం.. రాష్ట్రానికి చేరుకుంది. ఈ మేరకు ఏపీఐఐసీ ఛైర్మన్, ఎండీలతో కేంద్ర టెక్స్‌టైల్ శాఖ అధికారుల భేటీ అయ్యారు. రేపు వైఎస్ఆర్ జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనుంది.
కొప్పర్తిలో ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు అవకాశం అవకాశం ఉందని ఏపీఐఐసీ తెలిపింది. దీనిని జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లోని 1,188 ఎకరాల్లో ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. కొప్పర్తిలో ఇప్పటికే స్పిన్నింగ్, అపారెల్, టెక్స్‌టైల్ పరిశ్రమలు ఉన్నాయని ఏపీఐఐసీ పేర్కొంది. రాష్ట్రం నుంచి ఏటా రూ.3,615 కోట్ల టెక్స్‌టైల్ ఎగుమతులు జరుగుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు పీఎం మిత్ర పార్కు ద్వారా 3 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్రం అంచనా వేసింది.
ఇదీ చదవండి:Assago Industries CEO: "మౌలిక వసతులు కల్పిస్తే.. పరిశ్రమ ఏర్పాటు చేస్తాం"