నివర్ తుపాను పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రబృందం కడప జిల్లాలో పర్యటిస్తోంది. ఇప్పటికే రైల్వేకోడూరు, రాజంపేట, కడపలో బృందం సభ్యులు పర్యటించారు. రైల్వేకోడూరు మండలం రెడ్డివారిపల్లిలో గుంజనేరు వంతెనను పరిశీలించారు. చియ్యవరం పరిధిలోని చియ్యవరం ఏరు వంతెనను బృందం పరిశీలించింది. నష్టపోయిన వంతెనలు, పంట పొలాల ఫొటోలు చూపించి వారికి వివరించారు. అనంతరం పుల్లంపేటలో పర్యటించనుంది
కడపలో కేంద్ర బృందం పర్యటన.. నివర్ తుపాను నష్టంపై ఆరా - central team visit at kadapa
కడప జిల్లాలో కేంద్రబృందం పర్యటిస్తోంది. నివర్ తుపాను పంటనష్టంపై కేంద్రబృందం వివరాలు సేకరిస్తోంది. రైల్వేకోడూరు, రాజంపేట, కడప నియోజకవర్గాల్లో బృందం పర్యటిస్తోంది.
కడపలో కేంద్ర బృందం పర్యటన