ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Central Team: వరద నష్టంపై అంచనాకు కేంద్ర బృందం.. ఎప్పుడంటే? - కడపలో వరద నష్టం

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కడప జిల్లా అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో వరద నష్టంపై అంచనాకు ఈనెల 27న కేంద్ర బృందం (Central team tour in Kadapa) పర్యటించనుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి, పంట నష్టం వివరాలను సేకరించనుంది.

ఈనెల 27న కడప జిల్లాకు కేంద్ర బృందం
ఈనెల 27న కడప జిల్లాకు కేంద్ర బృందం

By

Published : Nov 25, 2021, 6:50 PM IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కడప జిల్లా అతలాకుతలమైంది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. ఆస్తి, పశు, పంట నష్టానికి అంతే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో.. కడప జిల్లాకు కేంద్ర బృందం (Central team tour in flood effected areas) రానుంది. ఈనెల 27న వరద ప్రభావిత ప్రాంతమైన రాజంపేట మండలంలో పర్యటించి వివరాలు సేకరించనుంది.

రాజంపేట వరదల్లో 38 మంది గల్లంతు..
రాజంపేట-నందలూరు మండలాల్లో బీభత్సం సృష్టించిన వరదల్లో.. ఇప్పటివరకు 38 మంది గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు. రాజంపేట మండలం మందపల్లి, గుండ్లూరు, పులపత్తూరు, తోగురుపేట గ్రామాల్లో 38 మంది వరదల్లో కొట్టుకుపోయినట్లు మన్నూరు ఎస్ఐ భక్తవత్సలం తెలిపారు. గల్లంతైనవారిలో ఇప్పటివరకు 25 మృతదేహాలను గుర్తించి, వారి బంధువులకు అప్పగించినట్లు ఎస్సై వెల్లడించారు. ఇంకా 13 మంది ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details