ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప స్టీల్‌ప్లాంట్‌కు కేంద్ర పర్యావరణ అనుమతి మంజూరు

కడప స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం పర్యావరణ అనుమతి మంజూరు చేసింది. 2020 డిసెంబరు 20న ప్రతిపాదనలు పంపినట్లు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర నిర్ణయంతో కీలక ముందడుగు పడిందన్నారు. అత్యంత వేగంగా పర్యావరణ అనుమతి సాధించామని రాష్ట్ర ప్రభుత్వం తెలింపింది.

కడప స్టీల్‌ప్లాంట్‌కు కేంద్ర పర్యావరణ అనుమతి మంజూరు
కడప స్టీల్‌ప్లాంట్‌కు కేంద్ర పర్యావరణ అనుమతి మంజూరు

By

Published : Mar 9, 2021, 10:08 PM IST

కడప స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతి మంజూరు చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నుంచి అనుమతి సహా..ఎన్విరాన్‌మెంట్‌ క్లియరెన్స్‌ వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కడప స్టీల్‌ప్లాంట్‌ విషయంలో కీలక ముందడుగు పడినట్లు ప్రభుత్వం భావిస్తోంది. 2020 డిసెంబర్‌ 20న తొలిసారి ప్రతిపాదనలు పంపామని..తిరిగి జనవరి 29, 2021న మరోసారి సవరణలతో ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ కాపీని జతచేసి ప్రతిపాదనలు పంపినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై గతేడాది డిసెంబర్‌ 30, 31, ఈ ఏడాది ఫిబ్రవరి 10,11 తేదీల్లో ‘ఈఏసీ’ సమావేశాలు జరిపినట్లు తెలిపారు.

కడప జిల్లా సున్నపురాళ్లపల్లె, పెద్దనందులూరు గ్రామాల్లో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ పేరుతో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తొలిదశలో ఏడాదికి 3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తితోపాటు 84.7 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొంది. ప్రాజెక్టు ఏరియాలో భాగంగా 33 శాతం అంటే 484.4 హెక్టార్లలో గ్రీన్‌బెల్ట్‌ అభివృద్ధి సహా..ఐదేళ్లలో 12 లక్షల10 వేల మొక్కలను నాటుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details