భారత రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ఆరోపించారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా... కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయజెండా ఎగరేశారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడారు. రాజ్యాంగానికి మూల స్తంభాలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి వాటిని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. మీడియాపై ఆంక్షలు విధించడమే కాకుండా ఎన్ఆర్సీ చట్టాన్ని తీసుకొచ్చి లౌకిక వాదాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోనూ రాక్షస, కీచక పాలన సాగుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు.
'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడుస్తున్నాయి' - కేంద్రంపై తులసిరెడ్డి కామెంట్స్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా పాలన సాగిస్తున్నాయని... కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ఆరోపించారు. మీడియాపైనా ఆంక్షలు విధించడమే అందుకు నిదర్శనమన్నారు. ఎన్ఆర్సీ చట్టాన్ని తీసుకొచ్చి లౌకిక వాదాన్ని దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి