కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి అరెస్ట్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. తప్పుడు కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చిరువ్యాపారుల పొట్టకొట్టే చర్యలు మానుకోవాలన్నారు. కమీషన్ల కోసం వ్యాపారులను వేధించడం దారుణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ కూల్చివేత ఆపాలి' - tdp leader arrest at prodhutur
కడప జిల్లా ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ కూల్చివేత ఆపాలని తెదేపా అధినేత డిమాండ్ చేశారు. కూల్చివేత అడ్డుకున్న తెదేపా మాజీఎమ్మెల్యేను అరెస్టు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలన్నారు.
!['ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ కూల్చివేత ఆపాలి' chandra babu on prodhuturu vegetable market](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10424118-165-10424118-1611920486259.jpg)
chandra babu on prodhuturu vegetable market
ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ కూల్చివేతను నిలిపేయాలని.. వ్యాపారులు వద్దని బతిమాలినా కూల్చటం తుగ్లక్ చర్య అని చంద్రబాబు ఆక్షేపించారు. ముస్లింలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు నడుపుకునే దుకాణాలు కూల్చడం ఏమిటని నిలదీశారు. వైకాపా ప్రభుత్వ విధ్వంసం... ప్రజావేదికతో మొదలై ప్రతి నియోజకవర్గంలోనూ కొనసాగుతోందని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్‌లో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు