CBI team reaches Pulivendula Court on Viveka Murder Case: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా నిశబ్దంగా ఉన్న కేసు విచారణలో కొత్త మలుపులు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకూ పోరాడుతున్న కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటుగా ఆ కేసును విచారించిన సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు పులివెందుల కోర్టుకు వచ్చారు. సీబీఐ అధికారులు వివేకా కుమార్తె సునీత తరఫున న్యాయవాదులు కోర్టులో సంప్రదింపులు జరిపారు. గతంలో వివేకా పీఏ కృష్ణారెడ్డి ఈ కేసులో సీబీఐ ఎస్పి రామ్ సింగ్, సునీత, రాజశేఖర్ రెడ్డిలపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పులివెందుల కోర్టు ఆదేశాలతో, పులివెందుల పోలీసులు ముగ్గురిపై ఈ నెల 15న కేసులు నమోదు చేశారు. ఆ సందర్భంలో తమపై నమోదైన కేసులు వివరాలను కోర్టు ద్వారా తీసుకునేందుకుఉత్తర్వు కాపీకావాలని సీబీఐ అధికారులు కోర్టుకు వచ్చినట్లు తెలిసింది. సీబీఐ ఎస్పీ రాంసింగ్, సునీత, రాజశేఖర్ రెడ్డికి సంబంధించినకోర్టు ఉత్తర్వులను పిటిషన్ వేసి తీసుకోవడానికి అధికారులు వచ్చినట్లు సమాచారం అందుతోంది.
వివేకా హత్య కేసులో కీలక మలుపు - ఆయన కుమార్తె, అల్లుడితో పాటు సీబీఐ ఎస్పీపై కేసు నమోదు
వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు:మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డితో పాటుగా, అప్పట్లో కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై పులివెందుల పోలీసులు కేసు నమోదుచేశారు.వివేకా హత్యకేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబందించి కొందరు నేతల పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు ఆ కృష్ణారెడ్డి ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేకించి ఎస్పీ రాంసింగ్ ఒత్తిడి తెస్తున్నారని అప్పట్లో పిటిషన్‌లో వెల్లడించారు. సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారని వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఆరోపించారు.