మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఛేదించడానికి సీబీఐ అధికారులు సాంకేతిక బృందాన్ని రంగంలోకి దించారు. ముగ్గురు సభ్యుల సాంకేతిక బృందం... వివేకా, అనుమానితుల కాల్ డేటాను పరిశీలించనుంది. హత్య జరిగిన రోజు వివేకా ఫోన్కు ఎవరు కాల్ చేశారు. అనుమానితులు ఎవరెవరితో మాట్లాడారనే విషయాలను సీబీఐ సాంకేతిక బృందం పరిశీలించనుంది.
ఈ కేసులో ఆరో రోజు విచారణ సందర్భంగా.. వాచ్మెన్ రంగన్నను విచారించింది. శుక్రవారం నుంచి అనుమానితులను పూర్తిస్థాయిలో విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.