ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Viveka Murder Case: మరోసారి సీబీఐ ముందుకు రంగన్న.. భారీ భద్రత

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. కేసులో కీలకంగా భావిస్తున్న రంగన్నను అధికారులు మరోసారి విచారణ చేశారు.

Viveka Murder Case
Viveka Murder Case

By

Published : Aug 21, 2021, 6:21 PM IST

మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఇవాళ వివేకా ఇంటి కాపలాదారు రంగన్నను అధికారులు మరోసారి విచారించారు. భారీ భద్రత మధ్య రంగన్న సీబీఐ విచారణకు వచ్చారు. వాంగ్మూలం ఇచ్చినప్పటి నుంచి రంగన్నకు పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. పులివెందుల పురపాలికలో పనిచేసే గంగన్నను సైతం సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు ఈ కేసులో కచ్చితమైన, నమ్మకమైన సమాచారం ఇచ్చిన వారికి 5 లక్షల రూపాయల బహుమానం ఇస్తామని సీబీఐ ఇప్పటికే రివార్డు ప్రకటించింది.

ఈ మేరకు పత్రికా ప్రకటన ఇచ్చింది. 2019 మార్చి 15న వివేకా దారుణ హత్యకు గురయ్యారని.. హైకోర్టు ఆదేశాల మేరకు గతేడాది జులై 9న వివేకా హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు.. సీబీఐ ఆ ప్రకటనలో పేర్కొంది. సామాన్య ప్రజలు ఎవరైనా సమాచారం అందించవచ్చని.. అలాంటి వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపింది. వివేకా హత్యకు సంబంధించి.. తెలిసిన సమాచారం సీబీఐ అధికారులైన దీపక్ గౌర్, రాంసింగ్ లకు అందజేయాలని వారి ఫోన్ నంబర్లు, చిరునామాను ప్రకటనలో వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details