ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Viveka Murder Case: సీబీఐ విచారణకు సునీల్​ యాదవ్​ బంధువు - YS Vivekananda Reddy Case

వైఎస్ వివేకా హత్య (YS Vivekananda Reddy Case news) కేసులో సీబీఐ అధికారులు విచారణను ముమ్మరం చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్​ దగ్గరి బంధువు భరత్​ కుమార్​ యాదవ్​ను అధికారులు ప్రశ్నించారు.

Viveka Murder Case
Viveka Murder Case

By

Published : Oct 1, 2021, 12:34 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య ( (YS Vivekananda Reddy Case News)) కేసులో సీబీఐ (CBI Investigation In YS Vivekananda Reddy Case) విచారణ కొనసాగుతోంది. కడప కేంద్రకారాగరం అతిథి గృహంలో 116వ రోజు విచారణ సాగుతోంది. వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్(Sunil Yadav news) దగ్గరి బంధువు భరత్ కుమార్ యాదవ్​ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సునీల్​కు భరత్ కుమార్ యాదవ్ మధ్య ఆర్థిక లావాదేవీలు సాగినట్లు సీబీఐ(cbi) అనుమానిస్తోంది. ఇప్పటికే భరత్​ను పలుమార్లు సీబీఐ ప్రశ్నించింది. ఇతనితో పాటు ఓ ప్రముఖ టీవీ ఛానల్ ప్రతినిధిని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వివేకా హత్య జరిగిన రోజు గుండెపోటుగా టీవీలో ప్రసారం అయిన అంశాలు.. వాటికి సంబంధించిన వివరాలు, ఫుటేజీ పరిశీలించి ప్రశ్నించినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details