Erra Gangireddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మొదటి నిందితుడైన ఎర్ర గంగిరెడ్డిపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. విచారణ వేగవంతం కావాలంటే అతడి బెయిలు రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రెండు నెలల కిందట హైకోర్టులో బెయిలు రద్దు పిటిషన్ వేసినా ఫలితం లేకపోయింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసులో ఇప్పటికే అయిదుగురు నిందితులను చేరుస్తూ ఛార్జిషీట్ దాఖలు చేసింది. వివేకా హత్య కేసులో ఏ-2 సునీల్ యాదవ్, ఏ-3 ఉమాశంకర్‌రెడ్డి, ఏ-5 దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీలుగా ఉన్నారు. ఏ-1 ఎర్ర గంగిరెడ్డి, ఏ-4 డ్రైవర్ దస్తగిరి బెయిలుపై ఉన్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారి సీబీఐకి అనుకూలంగా సాక్ష్యం ఇచ్చాడు. అతడి బెయిలు పిటిషన్‌కు సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో గత ఏడాది అక్టోబరులో కడప కోర్టు అనుమతిచ్చింది. ఈ కేసులో ఏ-1 ఎర్ర గంగిరెడ్డిని తప్పనిసరిగా అరెస్టు చేయాలని సీబీఐ వాదిస్తోంది.