ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివేకా హత్య కేసు: నాలుగో రోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ - వివేకా హత్య కేసు వార్తలు

వివేకా హత్య కేసులో నాలుగో రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి వరుసగా నాలుగు రోజుల పాటు విచారణకు హాజరయ్యారు.

Viveka murder case
వివేకా హత్యకేసు

By

Published : Jun 10, 2021, 11:10 AM IST

Updated : Jun 10, 2021, 3:40 PM IST

వివేకా హత్యకేసులో నాలుగో రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు... అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ హిదయతుల్లా, వైకాపా కార్యకర్త కిరణ్‌కుమార్‌ యాదవ్​ విచారణకు హాజరయ్యారు. దస్తగిరి వరుసగా నాలుగు రోజుల పాటు, హిదయతుల్లా మూడు రోజులుగా, కిరణ్‌కుమార్‌ యాదవ్‌ రెండు రోజుల నుంచి విచారణకు హాజరవుతున్నారు.

డ్రైవర్‌ దస్తగిరిని వరుసగా నాలుగు రోజులపాటు విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరితో పాటు పులివెందులకు చెందిన ఇద్దరు రవాణాశాఖ అధికారులను కూడా విచారించేందుకు సీబీఐ అధికారులు పిలిచారు. వివేకా హత్య జరిగిన ప్రదేశంలో అనుమానిత వాహనాలను గుర్తించేందుకు వారిని పిలిపించినట్లు సమాచారం.

Last Updated : Jun 10, 2021, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details