ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ - undefined
11:52 July 25
హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సీబీఐ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎర్ర గంగిరెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూర చేయగా, దానిని రద్దు చేయాలని సీబీఐ తొలుత హైకోర్టును ఆశ్రయించింది. సీబీఐ పిటిషన్‌ను హైకోర్ట్ తోసిపుచ్చడంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ మొదటి నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: రాష్ట్రపతిగా నా ఎన్నిక.. దేశ పేదలందరి విజయం: ముర్ము