ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

VIVEKA MURDER CASE: వివేకా హత్యకు వాడిన ఆయుధాల కోసం అన్వేషణ.. దక్కని ఫలితం - Vivekananda Reddy's murder latest updates

వైయస్ వివేకానందరెడ్డి హత్యకు వాడిన ఆయుధాల కోసం చేపట్టిన అన్వేషణ ముగిసింది. రోటరీపురం వాగులో యంత్రాలతో మట్టి తొలగించి గాలించినా ఫలితం దక్కలేదు.

ఆయుధాల కోసం అన్వేషిస్తున్న మున్సిపల్ సిబ్బంది సిబ్బంది
ఆయుధాల కోసం అన్వేషిస్తున్న మున్సిపల్ సిబ్బంది సిబ్బంది

By

Published : Aug 8, 2021, 6:49 PM IST

Updated : Aug 8, 2021, 7:37 PM IST

వైయస్ వివేకా హత్యకు వాడిన ఆయుధాల కోసం ఈ రోజు చేసిన అన్వేషణ ముగిసింది. పులివెందుల రోటరీపురంవాగులో మురికినీరు తొలగించి అన్వేషణ చేశారు. యంత్రాలతో మట్టి తొలగించి గాలించినా ఫలితం దక్కలేదు.

అయితే... రోటరీపురంవాగును మున్సిపల్ సిబ్బంది సర్వేచేస్తున్నారు. సునీల్ చెప్పిన సమాచారంపై అనుమానంతో సర్వే సిబ్బంది రంగంలోకి దిగారు. ఆయుధాల కోసం రేపు మళ్లీ సీబీఐ అధికారులు అన్వేషించనున్నారు.

కొనసాగుతున్న విచారణ

పులివెందులలో మరోసారి విచారణకు వివేకా హత్య కేసు అనుమానితులు హాజరయ్యారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఇనయతుల్లా, రంగన్న విచారణకు వచ్చారు. ప్రకాష్‌రెడ్డి, వంటమనిషి లక్ష్మమ్మ కుమారుడు ప్రకాష్​లను కూడా అధికారులు విచారించారు.

అధికారులను కలిసిన వివేకా కూతురు

పులివెందుల ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో సీబీఐ అధికారులను వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి కలిశారు. విచారణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:

AMARAVATI: రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తత..కఠినంగా పోలీసుల ఆంక్షలు

Last Updated : Aug 8, 2021, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details