ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివేకా హత్య కేసు: విచారణ అనంతరం దిల్లీకి సీబీఐ అధికారులు - వివేకా హత్య కేసు విచారణ అనంతరం దిల్లీకి బయలుదేరిన సీబీఐ అధికారులు

మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ పూర్తి చేసుకున్న సీబీఐ అధికారులు.. తిరిగి దిల్లీ వెళ్లారు. కడప జిల్లా పులివెందులలో వారంపాటు పలువురిని విచారించిన అనంతరం దిల్లీకి పయనమయ్యారు.

viveka murder case, cbi officials return to delhi from pulivendula
మాజీ మంత్రి వివేకా హత్య కేసు, పులివెందుల నుంచి దిల్లీకి బయలుదేరిన సీబీఐ అధికారులు

By

Published : Apr 18, 2021, 8:03 PM IST

Updated : Apr 18, 2021, 8:16 PM IST

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు.. ఇవాళ దిల్లీ బయలుదేరి వెళ్లారు. కడపజిల్లా పులివెందుల కేంద్రంగా.. పలువురు అనుమానితులను విచారించారు. కేసులో నిందితులుగా ఉన్న వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, వ్యవసాయ పనులు చూసే రాజశేఖర్, కారు మాజీ డ్రైవర్ దస్తగిరి తల్లిదండ్రులను సీబీఐ ప్రశ్నించింది. వివేకా పొలాన్ని కౌలుకు చేస్తున్న మహేశ్వర్ రెడ్డి కుటుంబాన్ని విచారించింది.

వారం పాటు పలువురు అనుమానితులను విచారించిన సీబీఐ అధికారులు... ఇవాళ పులివెందుల నుంచి దిల్లీ వెళ్లిపోయారు. మళ్లీ ఎపుడు వస్తారనేది తెలియాల్సి ఉంది. వివేకా కేసులో అనుమానితులుగా ఉన్న కొందరిని దిల్లీలో విచారిస్తున్నట్లు సమాచారం.

Last Updated : Apr 18, 2021, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details