మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 69వ రోజు కొనసాగుతోంది. కడప, పులివెందుల ప్రాంతాల్లో రెండు సీబీఐ బృందాలు విచారణ చేపట్టాయి. పులివెందుల అతిథి గృహంలో సీబీఐ విచారణకు నలుగురు అనుమానితులు హాజరయ్యారు. తుమ్మలపల్లి కర్మాగారంలో పనిచేసే ఉద్యోగి ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన తండ్రి ప్రకాష్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి.. ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడు కాగా ప్రకాష్ రెడ్డి ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు.
వీరితో పాటు.. ఉదయ్ కుమార్ రెడ్డి ఇంటి పక్కనే ఉంటున్న బాబు రెడ్డి దంపతులను కూడా పలు వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో మరో సీబీఐ బృందం ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నారు. సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్ యాదవ్ తో పాటు అతని సమీప బంధువు భరత్ కుమార్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు. నిన్న వివేకా కుమార్తె సునీత భద్రత కల్పించాలని ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పులివెందుల పోలీసులు వివేక ఇంటి వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.
పోలీసుల అదుపులో మణికంఠరెడ్డి...