ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొనసాగుతున్న వివేకా కేసు విచారణ.. పులివెందులలో పలు ప్రాంతాలను పరిశీలించిన సీబీఐ బృందం - ap latest news

VIVIEKA CASE: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. సీబీఐ అధికారి అంకిత్ యాదవ్ ఆధ్వర్యంలో రెండు వేర్వేరు బృందాలు.. వివేకా ఇంటితోపాటు.. ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే ఇనాయతుల్లాను వెంటబెట్టుకుని పట్టణంలోని వివిధ ప్రాంతాలు పరిశీలించారు.

VIVIEKA CASE
పులివెందులలో పలు ప్రాంతాలను పరిశీలించిన సీబీఐ బృందం.

By

Published : Jun 7, 2022, 2:54 PM IST

VIVIEKA CASE: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప నుంచి పులివెందుల చేరుకున్న రెండు సీబీఐ బృందాలు.. పలు ప్రాంతాలను పరిశీలించాయి. సీబీఐ అధికారి అంకిత్ యాదవ్ ఆధ్వర్యంలో రెండు వేర్వేరు బృందాలు.. వివేకా ఇంటితోపాటు.. ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే ఇనాయతుల్లాను వెంటబెట్టుకుని పట్టణంలోని వివిధ ప్రాంతాలు పరిశీలించారు. ఇతనితో పాటు రెవెన్యూ సర్వేయర్లను కూడా సీబీఐ అధికారులు తీసుకెళ్లారు. ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో ఎంపిక చేసుకున్న ప్రదేశాలను కొలతలు తీసుకున్నారు.

వివేకా హత్యకేసుకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టేందుకు అధికారులు ఇలా పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. గత ఐదారు రోజుల నుంచి ఇనాయతుల్లాను సీబీఐ అధికారులు తమ వెంట తిప్పుకుంటున్నారు. వివేకా హత్య జరిగిన రోజున బెడ్ రూం, బాత్ రూంలో రక్తపు మడుగులో పడి ఉన్న వివేకా మృతదేహాన్ని ముందుగా ఫోటోలు, వీడియోలు తీసింది ఇనాయతుల్లానే. అతను ఆ వీడియోలు, ఫోటోలు ముందుగా ఎవరెవరికి పంపారనే సమాచారం ఆధారంగా సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

పులివెందులలో పలు ప్రాంతాలను పరిశీలించిన సీబీఐ బృందం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details