CBI issued second notice to YS Avinash Reddy: వివేక హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో కడప ఎంపీకి అవినాష్ రెడ్డికిి సీబీఐ నుంచి మరోసారి పిలుపు వచ్చింది. గత నెల 28న తొలిసారిగా సీబీఐ ఎదుట హజరైన ఎంపీని..అధికారులు ఆరు గంటల పాటు విచారించారు. విచారణ ముగిసిన తరువాత సీబీఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన అవినాష్ రెడ్డి. తనను మరోసారి పిలిచే అవకాశం ఉందని వెల్లడించారు. మొదటిసారి విచారణ సమయంలో కడప ఎంపీ కాల్ డేటా ఆధారంగా సుదీర్ఘంగా విచారణ జరిపిన సీబీఐ అధికారులు.. ఇప్పుడు రెండోసారి మరిన్ని విషయాల పైన విచారించే అవకాశం ఉంది.
అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా వివేక హత్య జరిగిన రోజు తాడేపల్లి కార్యాలయంలో పనిచేసే నవీన్, అదేవిధంగా సీఎం OSD కృష్ణమోహన్ రెడ్డి మొబైల్స్ కు ఫోన్ చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. నవీన్, కృష్ణ మోహన్ రెడ్డిని కూడా ఈనెల మొదటి వారం కడపలో సీబీఐ సుదీర్ఘంగా విచారించింది. మరోసారి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని తెలిపినట్లు తెలుస్తుంది. ఈ నెల 24న అవినాష్‌రెడ్డిని మరోసారి ప్రశ్నించేందుకు.. అధికారులు సమాయాత్తం అవుతున్నారు.
గత విచారణలో కొత్త విషయాలు: గత నెల 28న కడప ఎంపీ వైెఎస్ అవినాశ్‌రెడ్డిని నాలుగున్నర గంటలపాటు విచారించిన CBI ప్రధానంగా ఆయన కాల్‌డేటాపై ఆరా తీసింది. నవీన్ మొబైల్ నంబర్‌కు అవినాష్ ఎక్కువగా కాల్ చేసినట్లు సీబీఐ తన దర్యాప్తులో గుర్తించింది.