ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Viveka murder case: కీలక వ్యక్తులను ప్రశ్నించిన సీబీఐ - వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం

మాజీమంత్రి వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు.. కీలక దశకు చేరుకుంది. నెల రోజుల నుంచి అనుమానితులను విచారిస్తున్న అధికారులు.. ఇప్పుడు ఈ కేసులో కీలక వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. విచారణలో భాగంగా శుక్రవారం వివేకానంద రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డితో పాటు పులివెందులకు చెందిన ఉమామహేశ్వర్, మాజీ డ్రైవర్లు దస్తగిరి, ప్రసాద్​తో పాటు మరో వ్యక్తిని విచారించారు.

CBI INVESTIGATION IS CONTINUED IN VIVEKA MURDER CASE
వివేకా హత్య కేసులో కీలక వ్యక్తులను ప్రశ్నించిన సీబీఐ

By

Published : Jul 9, 2021, 10:39 PM IST

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు(viveka murder case)కు సంబంధించి.. కడప కేంద్ర కారాగారంలో నెల రోజుల నుంచి సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. విచారణలో భాగంగా శుక్రవారం వివేకానంద రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డితో పాటు పులివెందులకు చెందిన ఉమామహేశ్వర్, మాజీ డ్రైవర్లు దస్తగిరి, ప్రసాద్​తో పాటు మరో వ్యక్తిని సీబీఐ అధికారులు విచారించారు. వీరి నుంచి సీబీఐ అధికారులు పలు కీలక అంశాలను రాబట్టారు. కేసు విచారణ మొత్తం అతికొద్దిమంది చుట్టే తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను అధికారులు నమోదు చేసుకున్నారు. విచారణ మొత్తం అత్యంత గోప్యంగా కొనసాగుతోంది.

ఎర్ర గంగిరెడ్డిని విచారించిన సీబీఐ అధికారులు

ఈ హత్య కేసులో.. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో ఎర్ర గంగిరెడ్డి, ఉమామహేశ్వరరెడ్డిని.. గురువారం సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు, రాజకీయాలు అన్నీ కూడా ఎర్ర గంగిరెడ్డి కనుసన్నల్లోనే జరిగేవి అనే ఆరోపణలు ఉన్నాయి. వివేకా ఎక్కడికి వెళ్లినా ఎర్ర గంగిరెడ్డి తోడుగా వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో వివరాల సేకరణకు ఇతన్ని గతంలోనే సిట్ అధికారులు గుజరాత్ తీసుకెళ్లి నార్కో అనాలసిస్ పరీక్షలు చేయించారు. ఇపుడు సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారించడం చర్చనీయాంశమైంది.



ఇదీ చదవండి:

CM JAGAN : 'ప్రముఖ నగరాల సరసన త్వరలో కడప చేరుతుంది'

ABOUT THE AUTHOR

...view details