ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Viveka murder case: వివేకా హత్య కేసులో.. నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తున్న సీబీఐ - వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తాజా వార్తలు

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు.. కీలక దశకు చేరుకుంది. వరుసగా 38వ రోజు విచారణ కొనసాగిస్తున్న సీబీఐ... నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, వాచ్ మెన్ రంగన్న కుమారుడు, పులివెందులకు చెందిన సిద్ధారెడ్డిలను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

cbi investigation going on in former mp viveka murder case
cbi investigation going on in former mp viveka murder case

By

Published : Jul 14, 2021, 12:20 PM IST

Updated : Jul 14, 2021, 12:38 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. విచారణను వేగవంతం చేసిన సీబీఐ అధికారులు.. 38వ రోజు నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, వాచ్ మెన్ రంగన్న కుమారుడు, పులివెందులకు చెందిన సిద్ధారెడ్డిలను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎర్రగంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరిని వరసగా విచారిస్తూనే ఉన్నారు. వీరితోపాటు మరికొందరు అనుమానితులను విచారణకు పిలుస్తున్నారు. దాదాపు రెండు వారాల నుంచి ఎర్రగంగిరెడ్డి, దస్తగిరిని వరసగా విచారిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

వివేకా హత్య జరగడానికి ఆరు నెలల ముందు దస్తగిరి పని మానేశాడు. ఇతడు ఇచ్చిన కొన్ని కీలక ఆధారాలతో గత నెలరోజుల నుంచి సీబీఐ అధికారులు పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. హత్య జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారు చేశారనే కేసులో రెండేళ్ల కిందట ఎర్రగంగిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిలుపైన ఉన్న వీరిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఘటన రోజు ఏం జరిగిందన్న విషయంపై.. మరింత స్పష్టత వచ్చే దిశగా కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

వివేకా హత్య కేసును సవాలుగా తీసుకున్న సీబీఐ అధికారులు విచారణలో దూకుడు పెంచారు. గత 38 రోజులుగా పలువురు అనుమానితులను విచారించారు. ఈ కేసులో అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. 2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురికాగా..మార్చి 14 అర్ధరాత్రి పులివెందులలో అనుమానాస్పదంగా తిరిగిన పలు వాహనాల వివరాలను సేకరించి ఆ దిశగా విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:

Viveka murder case: వివేకా హత్య కేసు విచారణ.. సాక్ష్యాలుంటే ఇవ్వాలంటూ సునీతకు లాయర్ లేఖ!

Last Updated : Jul 14, 2021, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details