Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ అధికారుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో మకాం వేసిన సీబీఐ డీఐజీ చౌరాసియా... వివేకా హత్య కేసుపై అధికారులతో ఆరా తీస్తున్నారు. హైకోర్టు తీర్పు దృష్ట్యా వాంగ్మూలం పత్రాలను... సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో సమర్పించనున్నారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరితో మరోసారి కోర్టులో.. వాంగ్మూలం నమోదు చేయించనున్నారు.
Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ అధికారుల విచారణ ముమ్మరం - Viveka Murder Case news
11:03 February 18
ys viveka murder case:కేంద్ర కారాగారం అతిథిగృహంలో సీబీఐ డీఐజీ చౌరాసియా మకాం
కడప సబ్ కోర్టు అనుమతి..
Viveka Murder Case : మాజీమంత్రి వివేకా హత్య కేసులో.. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారడానికి కడప సబ్ కోర్టు అనుమతి ఇచ్చింది. దస్తగిరి అప్రూవర్‌గా మారుతున్నాడని.. 306 సెక్షన్ కింద సాక్ష్యం నమోదు చేయాలని కడప సబ్ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. దస్తగిరిని అప్రూవర్‌గా మారేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు మరోసారి దస్తగిరి నుంచి 164 సెక్షన్ కింద మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం నమోదు చేయించనున్నారు.
YS Viveka Murder Case : వివేకా హత్య కేసు.. సీబీఐని కలిసిన మాజీ డ్రైవర్ దస్తగిరి