ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

VIVEKA MURDER CASE: వివేక హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ...కడపకు సీబీఐ డీఐజీ - viveka murder case news

VIVEKA MURDER CASE:మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు మరింత దూకుడు పెంచేందుకు చర్యలు చేపట్టారు. వివేకా హత్య కేసు కీలక దశకు చేరుకున్న సమయంలో దిల్లీ నుంచి సీబీఐ డీఐజీ చౌరాసియా కడపకు వచ్చారు.

VIVEKA MURDER CASE
VIVEKA MURDER CASE
author img

By

Published : Feb 18, 2022, 3:36 AM IST

VIVEKA MURDER CASE:మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు మరింత దూకుడు పెంచేందుకు చర్యలు చేపట్టారు. వివేకా హత్య కేసు కీలక దశకు చేరుకున్న సమయంలో దిల్లీ నుంచి సీబీఐ డీఐజీ చౌరాసియా కడపకు వచ్చారు. కడపలో సీబీఐ అధికారులతో ఆయన సమావేశమై కేసు పురోగతి పైన చర్చించినట్లు సమాచారం. సీబీఐ వివేకా హత్య కేసులో ఇప్పటికే రెండు చార్జీషీట్లు కోర్టులో వేయడంతోపాటు ఐదుగురిని నిందితులుగా చేర్చింది. మరికొందరి ప్రమేయం పైన ప్రస్తావించిన తరుణంలో త్వరలో అరెస్టు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారి కడప కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీబీఐ ఉన్నతాధికారి వారం రోజులపాటు జిల్లాలోనే ఉండి కేసు పురోగతిపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details