ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సిందేనని హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నెల 10వ తేదీన విచారణకు రావాలని సీఎం జగన్‌తో పాటు... వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని ఆదేశించింది. ఇవాళ హాజరు నుంచి జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి మినహాయింపు కోరగా... పదేపదే అడగటం ఏంటని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. వచ్చే శుక్రవారం విచారణకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
సీఎం జగన్, విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు షాక్ - సీఎం జగన్కు సీబీఐ కోర్టు షాక్
ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయి రెడ్డికి సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. వ్యక్తిగత హాజరు నుంచి వీరు మినహాయింపు కోరగా కోర్టు నిరాకరించింది. వచ్చే శుక్రవారం తప్పకుండా రావాలని స్పష్టం చేసింది.
![సీఎం జగన్, విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు షాక్ CBI court orders Chief Minister Jagan and MP Vijayasai Reddy to attend trial](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5582488-697-5582488-1578050488340.jpg)
జగన్, విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్డు షాక్