న్యాయమూర్తిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సందేశాలు పోస్ట్ చేశారన్న ఆరోపణలపై.. కడపకు చెందిన వ్యక్తిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మరింతమందిని అరెస్టు చేసే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై.. విజయవాడ నుంచి సీబీఐ సిబ్బంది.. నిన్న సాయంత్రం కడప చేరుకుని దర్యాప్తు చేశారు.
ఈ విచారణను అధికారులు అత్యంత గోప్యంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వారి అదుపులో ఉన్న వ్యక్తి ఎవరు? ఈ వ్యవహారంతో ఇంకెంత మందికి సంబంధం ఉంది అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.