లాక్డౌన్ అమలులో ఉన్నందున ప్రజలు సహకరించాలని కడప జిల్లా ఎస్పీ అన్భురాజన్ కోరారు. నింబంధనలు ఉల్లంఘించి బయట తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రొద్దుటూరులో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో అక్కడికి వెళ్లి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. అనవసరంగా బయటతిరిగే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అత్యవసరమైన వస్తువులు కావాలంటే కంట్రోల్ రూంకి సమాచారం అందిచాలని కోరారు. కరోనా విధుల్లో ఉన్న సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు, చేతి గ్లౌజులు ధరించాలన్నారు.
లాక్డౌన్ ఉల్లంఘిస్తే కేసులు: ఎస్పీ అన్భురాజన్ - కరోనాపై ఎస్పీ అన్బురాజన్ వ్యాఖ్యలు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయట తిరిగే వారిపై కేసులు నమోదు చేస్తామని కడప ఎస్పీ అన్భురాజన్ హెచ్చరించారు. అనవసరంగా వాహనాలు బయట తిరిగితే సీజ్ చేస్తామన్నారు.
![లాక్డౌన్ ఉల్లంఘిస్తే కేసులు: ఎస్పీ అన్భురాజన్ లాక్డౌన్ ఉల్లంఘిస్తే కేసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6758905-146-6758905-1586669896308.jpg)
లాక్డౌన్ ఉల్లంఘిస్తే కేసులు