కడప రైల్వే స్టేషన్ రోడ్ లో అనుమతి లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా కరోనా వైద్యం చేస్తున్న ప్రైవేట్ వైద్యశాలపై.. వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిల్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. అనుమతి లేకుండా కరోనా వైద్యం చేస్తున్నారనే విషయం కలెక్టర్ హరికిరణ్ దృష్టికి వచ్చిన మేరకు.. తనిఖీలు నిర్వహించారు.
కోవిడ్ చికిత్స అందించేందుకు ఆసుపత్రికి ఎలాంటి అనుమతి లేదన్న విషయంపై నిర్ధరణకు వచ్చారు. ఆ వెంటనే అధికారులు ఫిర్యాదును ఒకటో పట్టణ పోలీసులకు అందజేశారు. పోలీసులు సంజీవని ఆసుపత్రి పై కేసు నమోదు చేశారు.