కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక కమిషనర్ రాధపై దాడికి యత్నించిన వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెుత్తం 11 మందిపై కేసు నమోదు చేశామని.. నిన్న ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించగా, నేడు మరో 9 మందిని రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. అధికారుల విధులకు ఎవరు ఆటంకం కలిగించినా.. కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ ప్రసాదరావు హెచ్చరించారు.
మున్సిపల్ కమిషనర్‌పై దాడి కేసు: రిమాండ్‌కు 11 మంది నిందితులు
కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్‌పై దాడికి యత్నించిన వారిపై.. పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న ఇద్దరు నిందితులను రిమాండ్‌కు పంపగా.. నేడు మరో 9 మందిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
రిమాండ్‌లో 11 మంది నిందితులు
నిన్న కూరగాయల మార్కెట్లోని గదులను కూలుస్తుండగా.. వ్యాపారులు అడ్డుకోవటంతో ఘర్షణ మెుదలయ్యింది. సంఘటనా స్థలం వద్దే ఉన్న మున్సిపల్ కమిషనర్ రాధపై పలువురు వ్యాపారులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు.. మున్సిపల్ కమిషనర్ పరుగులు పెట్టి ఓ దుకాణంలోకి వెళ్లి, షట్టర్ వేసుకున్నారు.
ఇదీ చదవండి:మున్సిపల్ కమిషనర్‌పై దాడికి వ్యాపారుల యత్నం