ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కేసీ కాలువ లైనింగ్ పునరుద్దరణ పనులను చేపట్టాలి' - case canal lining reconstruction works

పంట పండాలంటే నీరు ఉండాలి.  నీరు ప్రవేశించాలంటే కాలువలు బాగుండాలి. కడప జిల్లాలో 51,269 ఎకరాలకు నీరిచ్చే కేసీ కాలువ మొదటి భాగంలో పలుచోట్ల లైనింగ్ దెబ్బతిన్న పునరుద్ధరణకు నోచుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

కేసీ కాలువ లైనింగ్ పునరుద్దరణ పనులను చేపట్టాలి

By

Published : Jun 3, 2019, 2:22 PM IST

కేసీ కాలువ లైనింగ్ పునరుద్దరణ పనులను చేపట్టాలి

కర్నూలు-కడప జిల్లా సరిహద్దులోని రాజోలి ఆనకట్ట వద్ద కేసి ప్రధాన కాలువ మొదటి ఎనిమిది కిలోమీటర్లను 1992 -94 మధ్య అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయ భాస్కర్ రెడ్డి లైనింగ్ పనులు చెేపట్టారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కోట్ల వ్యయంతో దీనిని ప్రారంభించారు. పనులు చేపట్టి ఏళ్లు గడవటంతో పలుచోట్ల రాతి కట్టడానికి వేసిన సిమెంట్ పూత తొలగిపోయింది. మరికొన్ని చోట్ల రాళ్లు బయటపడ్డాయి. ఇంకొన్ని చోట్ల లైనింగ్ ఉబ్బింది. ఆయకట్టు కింద పంటల సాగు కోసం కాలువకు నీరు విడుదల చేసిన సమయంలో నీటి ప్రవాహ వేగానికి లైనింగ్ మరింత చిద్రం అయ్యే ప్రమాదం ఉందని రైతులంటున్నారు. అదే జరిగితే భవిష్యత్తులో మట్టికట్ట కోతకు గురై సాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయంటున్నారు. నూతన ప్రభుత్వం కాల్వ మరమ్మతులకు నిధులు కేటాయించాలని రైతులు కోరుతున్నారు. కాల్వకు మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించనున్నట్లు కేసీ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details