ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప రిమ్స్​లో కరోనా అనుమానిత కేసు - కడప రిమ్స్​లో కరోనా అనుమానిత కేసు

ప్రపంచమంతటా కరోనా భయం వెంటాడుతోంది. కడప జిల్లాలో వ్యాధి లక్షణాలతో ముగ్గురు రిమ్స్​లో చేరారు. ఇద్దరికీ వ్యాధి లేదని నిర్ధారణ కాగా... మరో మహిళకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

carona suspected case in kadapa
కడప రిమ్స్​లో కరోనా అనుమానిత కేసు

By

Published : Mar 14, 2020, 12:11 PM IST

కడప రిమ్స్​లో కరోనా అనుమానిత కేసు

కడప రిమ్స్​లో నిన్న మూడు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వారిలో ఇద్దరికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. కరోనా లేదని ధ్రువీకరించినందున వారు వెళ్లిపోయారు. మరో మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. వారిద్దరూ ఇటీవల గల్ఫ్ నుంచి కడపకు వచ్చారు. కొద్ది రోజుల నుంచి జలుబు, జ్వరంతో బాధ పడుతుంటే అనుమానంతో రిమ్స్​కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా లేదని వైద్యులు నిర్ధారించారు. ఓ మహిళ ఇటీవల మక్కా యాత్ర ముగించుకుని కడపకు చేరుకుంది. గత కొద్ది రోజుల నుంచి విపరీతమైన దగ్గుతో బాధపడుతుంటే ఆమె బంధువులు రిమ్స్​కు తరలించారు. వైద్యులు ఆమెను కరోనా వార్డ్​లో పెట్టి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details