టైరు పగిలి కారు బోల్తా... ఐదుగురికి తీవ్ర గాయాలు - chitoor-kurnool route
ప్రశాంతంగా సాగుతున్న ప్రయాణంలో ఊహించని ప్రమాదం సంభవించింది. టైరు పగలటంతో కారు బోల్తా పడింది. చిత్తూరు- కర్నూలు జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో కడప రైల్వే సిఐ అశోక్ రెడ్డితోపాటు మరో నలుగురు గాయపడ్డారు
టైరు పగిలి కారు బోల్తా... ఐదుగురికి తీవ్ర గాయాలు
కడప జిల్లా దువ్వూరు వద్ద చిత్తూరు- కర్నూలు జాతీయ రహదారిపై టైరు పగిలి కారు బోల్తా కొట్టింది. హైదరాబాద్ వెళ్లి కారులో తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. కారు కల్వర్టు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కకు పడిపోయింది. ఈ సంఘటనలో కడప రైల్వే సిఐ అశోక్ రెడ్డితోపాటు అందులో ప్రయాణిస్తున్న మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దువ్వూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.