ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.. చిరు వ్యాపారి మృతి - కడప జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తాజా వార్తలు

కడప జిల్లా దువ్వూరు మండలం మీర్జా ఖాన్ పల్లె వద్ద.. చిత్తూరు - కర్నూలు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

car hits two wheeler on kurnool highway man died
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు

By

Published : Jan 22, 2021, 1:53 PM IST

కడప జిల్లా దువ్వూరు మండలం మీర్జా ఖాన్ పల్లె వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. చిరు వ్యాపారం కోసం నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన కుంభ ముత్యాలయ్య (31) దువ్వూరులో గుడిసె వేసుకుని నివాసముంటున్నారు. ఆయన ద్విచక్రవాహనంపై వస్తువులు పెట్టుకుని గ్రామాలు తిరుగుతూ వ్యాపారం చేసేవారు.

రోజువారీ క్రమంలో వస్తువులు పెట్టుకుని ద్విచక్రవాహనంపై చిత్తూరు - కర్నూలు జాతీయ రహదారిపై వెళ్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముత్యాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న దువ్వూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details