CAR SHORT CIRCUIT: వైఎస్సార్ జిల్లా బద్వేల్‌లోని నెల్లూరు రోడ్డులో షార్ట్ సర్య్కూట్ కారణంగా ఓ కారు కాలిపోయింది. కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లేందుకు యజమాని కారును బయటకు తీయగా ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు కారు దిగిపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలు చెలరేగి కారు కాలిపోతుండగా.. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో కాలిపోయిన కారు 8 లక్షల రూపాయలు విలువ చేస్తోందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. మార్గం మధ్యంలో ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటే ప్రాణ నష్టం జరిగేదని.. కుటుంబ సభ్యులు అన్నారు.
CAR SHORT CIRCUIT: షార్ట్ సర్య్కూట్తో దగ్ధమైన కారు.. ఎక్కడంటే?
CAR SHORT CIRCUIT: కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లేందుకు ఓ యజమాని కారును బయటకు తీయగా ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు కారు దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో జరిగింది.
షార్ట్ సర్య్కూట్తో దగ్ధమైన కారు