కడప జిల్లా మైదుకూరు మండలం జాండ్లవరం సమీప టోల్‌గేట్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా దొర్నిపాడు మండలం అర్జునాపురం గ్రామానికి చెందిన మేకల నడిపి హుస్సేన్ (30) మృతి చెందాడు. సతీష్‌రెడ్డి అనే వ్యక్తి గాయపడ్డారు. నెల్లూరు నుంచి మైదుకూరు వైపుకు వస్తున్న వాహనం ఎదురుగా వస్తున్న వేరే వాహనాన్ని ఢీకొట్టటంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుకాగా కారునడుపుతున్న హుస్సేన్ తీవ్రంగా గాయపడ్డారు. బయటకు తీసే లోపే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. గాయపడిన సతీష్‌రెడ్డిని 108లో బద్వేలు ఆసుపత్రికి తరలించారు.
రెండు కార్లు ఢీ.. ఒకరు మృతి - crime news in kadapa dst
కడప జిల్లా మైదుకూరు మండలం జాండ్లవరం సమీప టోల్‌గేట్ రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడిక్కడే చనిపోగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని బద్వేలు ఆసుపత్రికి తరలించారు.
car accidnet in kadapa dst one spot dead