కడప జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో రాకేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బద్వేల్‌కు చెందిన రాకేష్ స్నేహితులతో నెల్లూరు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. రోడ్డు ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా దెబ్బతింది. ఘటనపై బద్వేలు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. ఒకరు మృతి - రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి వార్తలు
కడప జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆగి వున్న లారీని కారు వేగంగా వచ్చి ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం