రాయలసీమకు కేవలం హైకోర్టు ఇచ్చి దానికి న్యాయ రాజధాని అని పేరు పెట్టడం సరికాదని మాజీ మంత్రి ఎంవీ మైసూరా రెడ్డి అభిప్రాయపడ్డారు. హైకోర్టు వల్ల రాయలసీమకు వచ్చే ప్రయోజనం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడారు.
రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయకపోతే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం తప్పదని ఎంవీ మైసూరా రెడ్డి స్పష్టం చేశారు. దీనికోసం రాయలసీమ ముఖ్య నేతలు త్వరలో సమావేశమై ఓ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన వివరించారు. కంటితుడుపు చర్యల వల్ల రాయలసీమకు ప్రయోజనం ఉండదని మైసూరా రెడ్డి పేర్కొన్నారు.