కడప: కాల్ రూటింగ్‌కు పాల్పడుతున్న ముఠా అరెస్టు.. 159 సిమ్‌కార్డుల స్వాధీనం
14:00 August 17
కడప జిల్లాలో కాల్ రూటింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ ఫోన్ కాల్స్‌ను స్థానిక కాల్స్‌గా మార్చి హైటెక్ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్ రూటింగ్ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించామన్నారు. రాయచోటికి చెందిన షేక్ ముజాహిద్ బాషా, షేక్ సలీం నుంచి ల్యాప్ ట్యాప్, టెలికాం పరికరాలు , 159 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ముంబయి కేంద్రంగా ఈ వ్యవహారం నడిపిస్తున్న వీరికి దిల్లీ, కువైట్‌లోని ముఠాలతో సంబంధమున్నట్లు వెల్లడించారు.