లాక్ డౌన్ సమయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ పోలీసులను ఆదేశించారు . బద్వేల్ పట్టణంలో పరిస్థితిని ఎస్పీ సమీక్షించారు. ఇది కీలకమైన సమయమని.. ప్రజల సంరక్షణకు శ్రద్ధ వహించి పనిచేయాలని సూచించారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా చూడాలని ఆదేశించారు. వారికి అవసరమైన నిత్యావసర సరకులు కూరగాయలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్లైనా గోపవరం మండలంలోని శ్రీనివాసపురం పీపీ కుంట చెక్ పోస్టులను సందర్శించి పోలీసులకు సూచనలిచ్చారు.
'ప్రజల సంరక్షణకు శ్రద్ధ వహించాలి' - cadapa sp anbhu rajan on lockdown
కడప జిల్లా బద్వేల్లో లాక్డౌన్ పరిస్థితులను ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు. ప్రజల సంరక్షణకు శ్రద్ధ వహించి పనిచేయాలని పోలీసులకు సూచించారు.
కడప లాక్డౌన్పై అన్బురాజన్