కడప జిల్లాలోని పులివెందులలో టన్ను అరటి ధర 8వేల రూపాయల వరకు ఉండగా... రాజంపేటలో మాత్రం మూడు వేల రూపాయల లోపు ఉండడం ఏమిటని వ్యాపారులను డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి ప్రశ్నించారు. అక్కడి వ్యాపారులకు గిట్టుబాటు ధర ఇక్కడి వ్యాపారులకు ఎందుకు రావడం లేదన్నారు. పంట చేతికి వచ్చే సమయంలో కరోనా కారణంగా రవాణా స్తంభించడంతో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
'అరటి రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోబోం'
ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి అరటి వ్యాపారులను హెచ్చరించారు. కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి మార్కెట్ యార్డులో అరటి వ్యాపారులు, రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఇలాంటి సమయంలో వ్యాపారులు లాభాపేక్ష చూసుకోకుండా రైతుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. గిట్టుబాటు ధరకు కొనకపోతే పులివెందుల అరటి వ్యాపారులను రాజంపేట పిలిపించి వారితో కొనిపిస్తామని హెచ్చరించారు. కరోనా బూచి చూపి దళారులు రైతులను నట్టేట ముంచుతున్నారని ఈ ప్రాంతానికి చెందిన రైతు వెంకటరాజు అధికారుల ముందు వాపోయారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక దళారుల చేతుల్లో మోసపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు .
ఇదీ చూడండిరక్షకులకు గొడుగులు అందించిన డీఎస్పీ