కడప జిల్లా గండికోట పునరావాస పరిహారం పంపిణీ వేగవంతం చేయాలని కలెక్టర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై సమావేశం నిర్వహించిన కలెక్టర్.. ప్రభుత్వం ఇప్పటికే రూ.145 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు.
ఈ నిధులతో నిర్వాసితులకు పరిహారం పంపిణీ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గండికోటలో 20 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి తీసుకోవలసిన చర్యలపై ఆయన చర్చించారు.