ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప జిల్లాలో కఠినంగా కొవిడ్ కర్ఫ్యూ ఆంక్షలు అమలు - కొవిడ్ కర్ఫ్యూ కడప వార్తలు

ప్రభుత్వ ఆదేశాల మేరకు కడప జిల్లాలో కొవిడ్ కర్ఫ్యూ కొనసాగుతోంది. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, ప్రైవేటు సంస్థలన్నీ మూతపడ్డాయి. అత్యవసర సర్వీసులకు మాత్రమే ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మిగతా కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి.

kadapa curfew news
kadapa curfew news

By

Published : May 5, 2021, 7:55 PM IST

కడప జిల్లా వ్యాప్తంగా కొవిడ్ కర్ఫ్యూ కొనసాగుతోంది. అధికారులు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా కర్ఫ్యూలో భాగస్వామ్యమవుతున్నారు. ప్రధాన కూడళ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పులివెందుల పట్టణ సీఐ భాస్కర్ రెడ్డి, ఎస్ఐ చిరంజీవి పులంగాల సర్కిల్ వద్ద దుకాణాలను మూసివేయించారు. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 12 గంటల లోపే డిపోకు చేరుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details