ఎస్సీ వర్గీకరణ విరుద్ధమంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దళిత మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కడప జిల్లా రాజంపేట పట్టణ శివారు మన్నూరు ఎల్లమ్మ ఆలయం నుంచి రైల్వే స్టేషన్ వరకూ ఈ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ శివయ్య మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం మడమ తిప్పారని ఆరోపించారు. వర్గీకరణపై చేసిన వ్యాఖ్యలు సీఎం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ దశల్లో ఆందోళన కార్యాక్రమాలు చేపట్టబోతున్నట్లు ఆయన వివరించారు.
సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బైక్ ర్యాలీ - byke rally
ఎస్సీ వర్గీకరణపై సీఎం వ్యాఖ్యలకు నిరసనగా కడప జిల్లా రాజంపేట పట్టణ శివారులో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బైక్ ర్యాలీ