కడప జిల్లా కమలాపురం మండలంలోని ఎర్రగుడిపాడు వద్ద వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదవశాత్తు పగేరు వంకలో జారిపడి నాగార్జున అనే యువకుడు మృతిచెందాడు. మృతుడు నాగార్జున టైల్స్ లో పనిచేసుకుని జీవనం సాగించేవాడు. ఎర్రగుడిపాడు వద్ద గతంలో టైల్స్ పనిచేయడంతో... ఎవరో కొత్త ఇల్లు కడుతున్నారని తెలియడంతో తనకు పనిస్తారేమో అని అడగడానికి వచ్చి, దగ్గరున్న పగేరు వంకలో కాళ్లు, చేతులు కడుక్కునే సమయంలో జారిపడి మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు.
వంకలో జారిపడి వ్యక్తి మృతి - etv bharat telugu latest news
కడప జిల్లా కమలాపురం మండలంలోని ఎర్రగుడిపాడు వద్ద ప్రమాదవశాత్తు పగేరు వంకలో జారిపడి వ్యక్తి మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు.
![వంకలో జారిపడి వ్యక్తి మృతి unfortunately person felldown at lack in kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7398169-591-7398169-1590761298396.jpg)
వంకలో పడి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
ఇదీ చూడండి