కడప జిల్లా అట్లూరులో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. బద్వేలు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు కడప వైపు వెళుతుండగా.. ముందుగా వెళ్తున్న లారీని అదుపుతప్పి ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగం దెబ్బతింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. పెద్ద ప్రమాదమే తప్పిందంటూ.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించి అట్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. - లారీని ఢీకొన్న బస్సు వార్తలు
కడప జిల్లా అట్లూరులో ఓ లారీని ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతినటంతో.. ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. సురక్షితంగా బయటుడ్డ ప్రయాణికులు