ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్రహ్మం గారి ఆరాధనోత్సవాల్లో.. ఎడ్ల పోటీలు - బ్రహ్మం గారి మఠం

బ్రహ్మం గారి ఆరాధనోత్సవాల్లో భాగంగా కడప జిల్లా అచలానంద ఆశ్రమంలో ఎడ్ల బండ లాగుడు పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన ఎడ్లు పాల్గొన్నాయి. పోటీల్లో గుంటూరు జిల్లా రైతుకు చెందిన ఎడ్లు ప్రథమ బహుమతి గెలుచుకున్నాయి.

బ్రహ్మం గారి ఆరాధనోత్సవాల్లో ఎడ్ల పోటీలు

By

Published : May 15, 2019, 4:50 PM IST

బ్రహ్మం గారి ఆరాధనోత్సవాల్లో ఎడ్ల పోటీలు

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం తోటపల్లి అచలానంద ఆశ్రమంలో ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. బ్రహ్మం గారి ఆరాధనోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన 7 జతల ఎడ్లు పాల్గొన్నాయి.

పోటీల్లో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన బత్తల శ్రీనివాసరావు ఎడ్లు మొదటి బహుమతి గెలుచుకున్నాయి. కడప జిల్లా చోటపల్లెకు చెందిన చంద్రబాబుల రెడ్డి ఎడ్లకు రెండో బహుమతి, ప్రకాశం జిల్లా పుల్లల చెరువుకు చెందిన నక్కా శ్రీనివాసరావు ఎడ్లకు మూడవ బహుమతి, గుంటూరు జిల్లా పెదకాకాని చెందిన తోట శ్రీనివాసరావు ఎడ్లకు నాలుగో బహుమతి, ప్రొద్దుటూరు వైఎమ్మార్​ కాలనీకి చెందిన గురివిరెడ్డి ఎడ్లకు అయిదో బహుమతి లభించింది.

ఇవీ చూడండి : రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో చలివేంద్రం

ABOUT THE AUTHOR

...view details