Bull Competitions in YSR District: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లెలో ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీల్లో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. ఈ పోటీలను ప్రారంభించేందుకు.. వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. పోటీలు ప్రారంభించే క్రమంలో ఎమ్మెల్యే ఎడ్లను అదిలించారు. ఎద్దులు ముందుకు కదలడంతో రాయిపై నిలబడి ఉన్న ఎమ్మెల్యే.. పట్టు కోల్పోయి ఒక్కసారిగా కింద పడ్డారు. దీంతో అక్కడ ఉన్నవారు ఆయన్ను పైకి లేపారు. ఎమ్మెల్యేకు స్వల్ప గాయం అయిందని, వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పినట్లు సమాచారం.
బండ లాగుడు పోటీలో అపశృతి.. ఎడ్లబండి పైనుంచి కిందపడ్డ ఎమ్మెల్యే - ap latest news
Bull Competitions in YSR District: వైఎస్ఆర్ జిల్లా దొరసానిపల్లెలో ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీల్లో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. పోటీలను ప్రారంభించే క్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గాయాలయ్యాయి.
బండ లాగుడు పోటీలు
ఎడ్ల పోటీలు: వైఎస్ఆర్ జిల్లా కలసపాడు మండలం మహానందిపల్లి వీరాంజనేయ స్వామి దేవస్థానం ఉత్సవాల్లో భాగంగా... ఎడ్ల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా..50వేలు, రెండో బహుమతిగా 30వేలు, మూడో బహుమతిగా 20 వేల రూపాయలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు అందజేశారు.
ఇదీ చదవండి:ONGOLE BULLS: బోయినవారిపాలెంలో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు
Last Updated : Apr 12, 2022, 8:12 AM IST