ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉల్లాసంగా ఎడ్ల పోటీలు... హుషారుగా జనం కేరింతలు - ఎద్దుల పోటీలు కడప

ఎడ్ల పోటీలంటే ఊరు వాడ సందడే సందడి..అచారం ఆపై సంతోషంతో కేరింతలు కొడుతున్న జనం.. కడప జిల్లా మైదకూరులోని ఎడ్ల బండి పోటీల్లో జనం ఆ సంతోషంలోనే ఉన్నారు. కొండయ్య స్వామి వేడుకల్లో అక్కడి వారంతా మునిగిపోయారు.

కడపలో ఉత్సాహంగా సాగిన ఎడ్ల పోటీలు

By

Published : Nov 6, 2019, 9:37 PM IST

కడపలో ఉత్సాహంగా సాగిన ఎడ్ల పోటీలు

కడప జిల్లా మైదుకూరు పురపాలిక ధరణి తిమ్మాయపల్లెలో ఎడ్ల బండలాగుడు పోటీలు ఘనంగా జరిగాయి. అవధూత కొండయ్యస్వామి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను తిలకించేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులతో పాటు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎడ్లు బండను లాగుతున్న కొద్దీ రైతులు ఉత్సాహంతో కేరింతలు వేశారు. ఈ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బురుజు గ్రామానికి చెందిన సోహిత్‌రెడ్డి ఎడ్లకు రూ.3 లక్షలు,.. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన గగనాచౌదరి ఎడ్లు ద్వితీయ స్థానంలో నిలిచి.. రూ.2 లక్షలు గెలుచుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details